కొరటాల కోరికను పక్కనబెట్టిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్‌ను మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తన సత్తాను బాక్సాఫీస్‌కు చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటూ వచ్చింది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిరు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అయితే ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు కొరటాల శివ సూచించాడట.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే బాగుంటుందని, ఇంకా సినిమా మెజారిటీ షూటింగ్ మిగిలి ఉండటంతో టీజర్‌ను మళ్లీ ఎప్పుడైనా రిలీజ్ చేస్తే బాగుంటుందని చిరు చెప్పడంతో చిత్ర యూనిట్ ఆ విధంగా ప్లాన్ చేస్తోంది.మొత్తానికి చిరు బర్త్‌డేకు కేవలం ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.

Advertisement

ఏదేమైనా తమ అభిమాన హీరో చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆయన పుట్టినరోజు కానుకగా ఇవ్వడం తమకు పర్ఫెక్ట్ గిఫ్ట్ అని వారు అంటున్నారు.ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కేమియో పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు