చీకోటి ప్రవీణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.

ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు చీకోటికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా చీకోటి ప్రవీణ్ పై గతంలో ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో చీకోటి తన ప్రైవేట్ గన్ మెన్లతో గుడి వద్ద హల్ చల్ చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది.

కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసులో ఏ-1 గా ఉన్న చీకోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ మంజూరైంది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు