పిల్లల్లో ఊబకాయం సమస్యకు చెక్ పెట్టండి...!

ప్రస్తుత కాలంలో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాటిలో ఊబకాయం సమస్య ఒకటి.ఇది కేవలం పెద్దవారిలో మాత్రమే అనుకుంటే పొరపాటే.

రోజు రోజుకి మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ ఊబకాయ సమస్య ఎక్కువగా కనపడుతోంది.ఇక ఈ సమస్య కొరకు ప్రోబయోటిక్స్ ను ఉపయోగించి చిన్న పిల్లల్లో ఊబకాయం సమస్యకు చెక్ పెట్టవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు.

Check The Obesity In Childrens Check ,obesity ,children , Kids, Obesity Problem

ఇకపోతే ప్రోబయోటిక్స్ ఆహారపదార్థాల వల్ల అనేక ప్రయోజనాలు మనకు చేకూరుతాయి.ఇందులో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా మానవ శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.

వీటి వలన మన జీవక్రియ, జీర్ణక్రియ రెండు మెరుగుపడి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.వీటితో పాటు శరీరంలోని ఏవైనా అలర్జీ వంటి రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Advertisement

ప్రోబయోటిక్స్ ఎక్కువగా మనకి పచ్చళ్ళు, పాలు, పెరుగు, బట్టర్ లాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తాయి.ఇక తాజాగా కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం మేరకు ఈ ప్రోబయోటిక్స్ వలన అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నిర్ధారణ జరిగింది.

వీటి ఉపయోగం కారణంగా చిన్న పిల్లలలో చాలా తక్కువ మందికి వచ్చే ఊబకాయం లాంటి సమస్యలను అతి సులువుగా ఎదుర్కోవచ్చు అని తేల్చారు.ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు 6 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలపై పరిశోధనలు చేయగా అందులో తెలియజేశారు.

ఇందుకు సంబంధించి మితమైన ఆహారం ఇవ్వడం తో పాటుగా ప్రోబయోటిక్స్ వారి ఆహారంలో అందజేశారు.వీటిని ఇవ్వడం ద్వారా పిల్లల శరీరంలో జీవక్రియ రేటు శక్తివంతంగా మారి చిన్న వయసులో ఊబకాయం పొందిన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

అంతేకాక వీటివల్ల ఏమైనా డయాబెటిస్, గుండెపోటు లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు తెలియజేశారు.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు