CM Jagan Chandrababu : చంద్రబాబు జేబులోకి నిధులు పారేలా చేసుకున్నారు.. కుప్పంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్( CM Jagan ) పర్యటన కొనసాగుతోంది.

ఇందులో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కుప్పం నియోజకవర్గానికి( Kuppam Constituency ) కృష్ణా జలాలను విడుదల చేశారు.

ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు కుప్పంకు 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు.కానీ నియోజకవర్గానికి కనీసం సాగునీరు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు.

కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయారని చెప్పారు.కుప్పానికే ప్రయోజనం లేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందన్నారు.

Chandrababu Made Funds Flow Into His Pocket Cm Jagans Key Comments In The Heap
Advertisement
Chandrababu Made Funds Flow Into His Pocket Cm Jagans Key Comments In The Heap-

అంచనాలను రూ.560 కోట్లకు పెంచి తనకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారని పేర్కొన్నారు.ముఖ్యమైన పనులను వదిలేశారన్న ఆయన చంద్రబాబు జేబులోకి నిధులు పారేలా చేసుకున్నారని ఆరోపించారు.

తన సొంత నియోజకవర్గ ప్రజలను కూడా చంద్రబాబు దోచుకున్నారన్నారు.చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజలకు జోహార్లని తెలిపారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పంకు నీరు ఇచ్చామన్న సీఎం జగన్ మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ చేశామని పేర్కొన్నారు.అంతేకాకుండా చిత్తూరు డెయిరీని తెరిపించామని తెలిపారు.

పులివెందులలో ఉన్నా.కుప్పంలో ఉన్నా.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?

అమరావతిలో ఉన్నా పేదలకు అండగా ఉన్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు