యాదాద్రి జిల్లాలో గొలుసు దొంగల హల్చల్

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లాలో గొలుసు దొంగలు వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నారు.

మొన్న మోత్కూరు మండలంలో మహిళ మెడలోంచి మూడు తులాల బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన మరువక ముందే శుక్రవారం ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలోని ఓల్డ్ సిటీ(పాత గ్రామం)లో శుక్రవారం రాత్రి మేకపోతుల స్వామి(కానిస్టేబుల్), అతని భార్య నర్మద,పిల్లలతో పాటు తల్లి ధనమ్మతో కలిసి తమ డాబాపై నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నర్మద మెడలోని పుస్తెలతాడు,నల్ల పూసల దండ కలిపి సుమారు 5 తులాల బంగారం దొంగిలించారు.

నర్మద ఉదయం లేచి చూసుకునేసరికి మెడలోని పుస్తెలతాడు,నల్ల పూసల దండ కనిపించలేదని భర్త స్వామికి తెలపడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏసిపి మధుసూదన్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా మహిళల మెడలపై పుస్తెలతాడు అపహరణకు గురవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.గ్రామాల్లో ప్రజలు ఆరుబయట నిద్రపోవద్దన్నారు.

Advertisement

కొత్త వ్యక్తులు రాత్రి వేళలో కనిపించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఉర్సు ఉత్సవాలకు రండి -కేటీఆర్ కు ఆహ్వాన పత్రం
Advertisement

Latest Video Uploads News