కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం.. రూ.కోటి గెలుచుకోవచ్చిలా

కేంద్ర ప్రభుత్వం( Central Govt ) సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.జీఎస్‌టీ చెల్లిస్తున్న కస్టమర్లు రూ.

కోటి వరకు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.కేవలం మనం కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన బిల్లులను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు ఆ భారీ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి పొందొచ్చు.

జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌ను మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసినందుకు కస్టమర్‌లకు ప్రభుత్వం త్వరలో రివార్డ్‌లను అందజేస్తుంది.ప్రభుత్వం త్వరలో మేరా బిల్లు మేరా అధికార్ పథకాన్ని ప్రారంభించబోతోంది.ఈ పథకం కింద, వినియోగదారులకు కోటి రూపాయల వరకు బహుమతి ఇవ్వబడుతుంది.ఈ ఇన్‌వాయిస్ ప్రోత్సాహక పథకం కింద, రిటైలర్లు, టోకు వ్యాపారుల నుండి స్వీకరించిన ఇన్‌వాయిస్‌లను యాప్‌లో అప్‌లోడ్ చేసిన యూజర్లకు నెలవారీ, త్రైమాసిక ప్రాతిపదికన రూ.10 లక్షలు నుంచి రూ.1 కోటి వరకు నగదు బహుమతులు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

జీఎస్‌టీని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది.దీని ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా వస్తోంది.అయితే కొందరు వ్యాపారులు జీఎస్‌టీ లేకుండా క్రయవిక్రయాలు చేస్తుంటారు.

Advertisement

ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు, ప్రజల్లు జీఎస్‌టీ చెల్లించేలా ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం మేరా బిల్లు మేరా అధికార్ పథకాన్ని అమల్లోకి తీసుకు రానుంది.ఈ మొబైల్ యాప్ త్వరలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడే వారికి అందుబాటులోకి రానుంది.

ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయబడే అన్ని ఇన్‌వాయిస్‌( Invoice )లు విక్రేత యొక్క జీఎస్‌టీ నంబర్‌ను కలిగి ఉండాలి.

దీనితో పాటు ఇన్‌వాయిస్ నంబర్, బిల్లు మొత్తం, చెల్లించిన పన్నును పేర్కొనాలి.ఒక నెలలో గరిష్టంగా 25 ఇన్‌వాయిస్‌లను మాత్రమే అప్‌లోడ్ చేయవచ్చు.అయితే కనీస కొనుగోలు విలువ రూ.200 ఉండాలి.ప్రతి నెలా 500 మందికి పైగా కస్టమర్ల పేర్లను కంప్యూటర్‌ సహాయంతో లక్కీ డ్రాలో డ్రా చేయనున్నారు.

నెలవారీ, త్రైమాసిక ప్రాతిపదికన రెండు లక్కీ డ్రాలు నిర్వహించబడతాయి.ఇందులో ధర గరిష్టంగా రూ.కోటి వరకు గెలుపొందవచ్చు.ఈ పథకం ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

ఈ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. జీఎస్టీ ఎగవేతను( GST ) తగ్గించడం కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు