ప్రమాదాలకు కేరాఫ్ గా మారిన సీసీ రోడ్లు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapuram ) మండల కేంద్రంలో నూతంగా ఏర్పాటు చేసిన సిసి రోడ్లకు మార్జిన్ వర్క్ పూర్తి చేయకపోవడంతోస్థానికులు,వాహనదారులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సీసీ రోడ్లు ( CC roads )ఎత్తులో ఉండడం,పక్కన మట్టితో లెవల్ చేయకపోవడంతో పక్కన వాహనాలు నిలిపే పరిస్థితి లేక,రోడ్డుపై పార్క్ చేయలేక ఇక్కట్లకు గురవుతున్నారు.

ఎదురుగా పెద్ద వెహికిల్ వస్తే కిందకు దిగే అవకాశంకిందపడే ప్రమాదం ఉందనివాపోతున్నారు.నెలలు గడుస్తున్నా సీసీ రోడ్లకు ఇరువైపులా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి మట్టిని పోయకపోవడం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులుతక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

వేములవాడ ప్రధాన అగ్నిమాపక అధికారికి సేవా పతకం అవార్డు
Advertisement

Latest Yadadri Bhuvanagiri News