ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్చిన, వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేసిన కేసులు తప్పవు..

జిల్లాలో రెండు నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 ద్విచక్ర వాహన సైలెన్సర్లను మరియు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన 03 పోలీస్ సైరన్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధ్వంసం చేసారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని,శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయునది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలని,ఎవరైన వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నా వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా వాహనాలకు పోలీస్ సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్లు బిగించిన సుమారు 10 వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు.వాహణలకు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నా వారి సమాచారం సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్.ఐ 8712656441 , వేములవాడ ట్రాఫిక్ ఎస్.ఐ 8712656440 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?
Advertisement

Latest Rajanna Sircilla News