కన్నీరు పెట్టిస్తున్న నవి ఇంద్రన్ రియల్‌ స్టోరీ... రెండు సార్లు క్యాన్సర్‌, పెళ్లి చేసుకోవాలనే ఆశతో...!  

Cancer Survivor Navi Indran Pillai Viral Wedding Photoshoot- Cancer Survivor,cancer Survivor,navi Indran Pillai,wedding Photoshoot

  • ఎన్నో జబ్బులకు మరియు ప్రమాదాలకు చికిత్సలు అయితే చేస్తున్నారు కాని క్యాన్సర్‌ కు మాత్రం చికిత్స చేయడంలో వైధ్యులు విఫలం అవుతున్నారు. మొదటి లేదా రెండవ దశలో ఉన్న క్యాన్సర్‌ను గుర్తిస్తే వెంటనే చికిత్స చేస్తున్నారు. అయితే చివరి దశలో ఉన్న క్యాన్సర్‌ను మాత్రం ఎవరు కూడా క్యూర్‌ చేయలేక పోతున్నారు. క్యాన్సర్‌ వ్యాది మొదటి రెండవ దశలో ఉన్నా చికిత్స తీసుకోవడం అనేది తిరిగి జన్మించినంతగా ఉంటుంది. అంటే అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ఎన్నో రకాలుగా క్యాన్సర్‌ వ్యాదిన పడిన వారు ఆత్మ స్థైర్యంతో ముందడుగు వేస్తున్నారు. అలాగే వైష్ణవి పూవేంద్రన్‌ కూడా కాన్యర్‌ తొలిచేస్తున్నా కూడా నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది.

  • మూడు పదుల వయసులో కేవలం అయిదు సంవత్సరాల వ్యవదిలో ఆమెను రెండు సార్లు క్యాన్సర్‌ కభలించేందుకు ప్రయత్నించింది. మొదటి సారి క్యాన్సర్‌ను సక్సెస్‌ఫుల్‌గా జయించిన వైష్ణవి తిరిగి సాదారణ జీవితాన్ని గడిపేందుకు సిద్దం అయ్యి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో మరోసారి ఆమెకు క్యాన్సర్‌ ఎటాక్‌ అయ్యింది. రెండవ సారి కూడా కీమో థెరఫీ చేయించుకుంటున్న సమయంలో ఆమె జుట్టు మొత్తం పోయింది. అయినా కూడా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తోంది.

  • Cancer Survivor Navi Indran Pillai Viral Wedding Photoshoot-Breast Cancer Navi Photoshoot

    Cancer Survivor Navi Indran Pillai Viral Wedding Photoshoot

  • అందరు అమ్మాయిల మాదిరిగా పెళ్లి కూతురు అవ్వాలని, పెళ్లి చేసుకోవాలని వైష్ణవికి చాలా బలమైన కోరిక. కాని ఆమె క్యాన్సర్‌ విషయం తెలిసిన వారు ఎవరు ముందుకు రారు. ఆ విషయం తెలిసి కూడా చేసుకునేందుకు వచ్చారు అంటే వారి జీవితం కూడా బలి అవుతుందని వైష్ణవి భావించి పెళ్లికి దూరంగా ఉంది. అయితే ఆమె కోరిక మాత్రం అలాగే ఉండటంతో పెళ్లి కూతురు అయ్యింది. తాజాగా ఒక ప్రముఖ సంస్థ వైష్ణవిని పెళ్లి కూతురుగా అలంకరించి ఫొటో షూట్‌ చేసింది. జుట్టు లేకపోయినా కూడా వైష్ణవిలో పెళ్లి కూతురు కల వచ్చిందని నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • Cancer Survivor Navi Indran Pillai Viral Wedding Photoshoot-Breast Cancer Navi Photoshoot
  • భయంకరమైన క్యాన్సర్‌ ఉన్నా కూడా ఆమె ఎంత స్వచ్చమైన నవ్వుతో, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. కొందరు చిన్న జబ్బు లేదా జ్వరం వస్తేనే వామ్మో వాయ్యో అంటూ లేవకుండా ఉంటారు. అలాంటిది వైష్ణవి ఇంత ధైర్యంగా నిలుస్తుందంటే నిజంగా ఆమె ది గ్రేట్‌.