పెళ్లిలో నలుగురికి మంచి భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అందరూ చూస్తారు.
అయితే పిలిచిన పెళ్లికి వెళ్లడానికే సమయం దొరకని ఈ రోజుల్లో పిలవని పేరంటానికి భోజనం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.
జాయ్ మెల్గాజ్(30) ఘనంగా తన వివాహ వేడుకను జరుపుకున్నాడు.కాగా పెళ్లి అనంతరం గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చాడు.
ఈ రిసెప్షన్ పార్టీలో భోజనం చేసేందుకు క్యాస్టానెదా రమిరెజ్(28) అతడి సోదరుడు జోస్యూ క్యాస్టానెదా రమిరెజ్‌లు వచ్చారు.వారిని ఈ వేడుకకు జాయ్ పిలవలేదు.
అయితే వారిని గుర్తుపట్టిన జాయ్ కుటుంబ సభ్యులు, వారిని ఆ వేడుక నుండి వెళ్లగొట్టారు.ఇది అవమానంగా భావించిన ఆ ఇద్దరు సోదరులు, జాయ్ మెల్గాజ్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లే సమయంలో గొడవకు దిగారు.
తమ వెంట తెచ్చుకున్న బ్యాట్లతో జాయ్ మరియు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు.ఈ దాడిలో జాయ్ తీవ్రంగా గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా పెళ్లయిన కొన్ని క్షణాల్లోనే పెళ్లికొడుకు మృతిచెందడంతో ఆ వధువు కన్నీరుమున్నీరయింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy