కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై బిఆర్ఎస్ఎస్ హర్షం

యాదాద్రి భువనగిరి జిల్లా: టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్( Bomma Mahesh Kumar Goud ) ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ రిజర్వేషన్ సాధన సమితి( BC Reservation ) రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

ఆదివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా విద్యార్థి దశ నుంచే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభపరిణామన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ నియమించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.మహేష్ కుమార్ ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నోముల రమేష్ నేత,స్థానిక నాయకులు గంజి రాములు,లింగాల సతీశ్,రాము తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పారదర్శకంగా ముగిసిన వాహనాల, వస్తువుల వేలం..
Advertisement

Latest Telugu Top Posts News