బిజెపి గూటికి చేరిన బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మంద రాజేందర్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మంద రాజేందర్ బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వేములవాడ రూరల్ మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు పలువురు యూత్ నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు.

అయితే రాష్ట్రంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకపోవడంతో బిజెపిలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Advertisement

Latest Rajanna Sircilla News