అనారోగ్యంతో మరణించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు.. !

ఇప్పటికే కరోనా వల్ల, అనారోగ్యాల వల్ల ఎందరో ప్రముఖులతో పాటుగా, సామాన్యులు మరణిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సంవత్సరం సుమారుగా మరణాల సంఖ్య ఊహించని స్దాయిలో ఉంది.

ఇకపోతే సంగీత ప్రస్దానంలో మరో స్వరం మూగబోయింది.బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్(78) నాగ్‌పూర్ లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ లక్ష్మణ్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా 1975లో పండూ హవల్దార్ అనే మరాఠీ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్.

అయితే తన స్నేహితుడు సురేంద్రతో కలిసి రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీతం అందించడం మొదలు పెట్టారు.ఆయన మరణించినా అదే పేరుతో పలు చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారట.

Advertisement

ఇకపోతే ఇప్పటి వరకు రామ్ లక్ష్మణ్, హిందీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో 150కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.అదీగాక మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, 100 డేస్, పత్తర్ కే పూల్ వంటి ఆయన బాణీలు సమకూర్చిన చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు