గ్యాస్ నొప్పిని క్ష‌ణాల్లో త‌గ్గించే న‌ల్ల ఉప్పు.. ఎలాగంటే?

గ్యాస్ నొప్పి లేదా గ్యాస్ ట్ర‌బుల్‌కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, టైమ్‌కు ఆహారం తీసుకోకపోవడం, మ‌ద్యం అల‌వాటు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చాలా మంది గ్యాస్ నొప్పిని ఎదుర్కొంటున్నారు.

అయితే గ్యాస్ నొప్పి రాగానే దాదాపు అంద‌రూ చేసే ప‌ని టాబ్లెట్ వేసుకోవ‌డం.కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే ఎలాంటి టాబ్లెట్స్ వేసుకోకుండానే గ్యాస్ నొప్పికి చెక్ పెట్ట‌వ‌చ్చు.

ముఖ్యంగా గ్యాస్ నొప్పిని నివారించ‌డంలో న‌ల్ల ఉప్పు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌న భార‌తీయులు పురాతన కాలం నుంచి ఈ న‌ల్ల ఉప్పును వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు.

ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను న‌యం చేసేందుకు కూడా న‌ల్ల ఉప్పును వినియోగిస్తారు.అలాగే గ్యాస్ నొప్పి ఉన్న వారికి కూడా న‌ల్ల ఉప్పు గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Advertisement

ఒక గ్లాస్ ప‌ల్చ‌టి మ‌జ్జిగ‌లో చిటికెడు న‌ల్ల ఉప్పు క‌లిపి సేవించాలి.ఇలా చేస్తే క్ష‌ణాల్లోనే గ్యాస్ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

గ్యాస్ నొప్పి మాత్ర‌మే కాదు క‌డుపులో మంట‌, అసిడిటీ, గుండెల్లో మంట, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు కూడా న‌ల్ల ఉప్పును ఉప‌యోగించ‌వ‌చ్చు.న‌ల్ల ఉప్పును గోరు వెచ్చ‌ని నీటిలో చిటికెడు వేసి తీసుకుంటే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

ఇక న‌ల్ల ఉప్పుతో మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు తెల్ల ఉప్పు కంటే న‌ల్ల ఉప్పు వాడ‌టం చాలా మంచిది.ఎందుకంటే, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేయ‌డంలో న‌ల్ల ఉప్పు ఎఫెక్టివ్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.అలాగే ఒంట్లో వేడి ఎక్కువైన వారు కొబ్బ‌రి నీటిలో చిటికెడు న‌ల్ల ఉప్పు క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భించడంతో పాటు త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు