మైనంపల్లి దారేటు..బిజెపి వద్దంటోంది కాంగ్రెస్ రమ్మంటుంది..!!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ( Mynampally Hanumanth Rao) హాట్ టాపిక్ గా మారారు.బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై పలు కామెంట్లు చేసి చర్చనీయాంశంగా మారారు.

 Bjp Not Wants Mainampalli Congress Will Come What Is His Way, Ramachandra Rao ,-TeluguStop.com
Telugu Congress, Harish Rao, Medakmalkajgiri, Medchal, Mla Ticket, Ramachandra R

తన కొడుక్కు మెదక్ టికెట్ ఇవ్వాలని లేదంటే ఊరుకునేది లేదంటూ అల్టిమేటం జారీ చేశారు.బీఆర్ఎస్ పార్టీకి ఎదుగు తిరిగారు.హరీష్ రావు ( Harish rao ) ను గురించి అనేక విషయాలు మాట్లాడారు.ఈ తరుణంలోనే బీఆర్ ఎస్ క్రమశిక్షణ చర్యల కింద మైనంపల్లికి గట్టి వార్నింగ్ ఇవ్వబోతోంది.

పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందనే వాదన కూడా బయటకు వచ్చింది.ఇదే తరుణంలో మైనంపల్లి మరో పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.మరి ఆయన బిజెపి ( BJP ) లోకి వెళ్తారా.లేదంటే కాంగ్రెస్ గూటిలోకి వెళ్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం.ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 మంది ఎమ్మెల్యే స్థానాలు ప్రకటించింది.

ఇందులో టికెట్ ఆశించి భంగపడిన కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు.

వారందరినీ బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలు వారి వారి పార్టీలలోకి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అలా బిఆర్ఎస్( BRS party ) పై అసంతృప్తిగా ఉన్న నేతల్లో మైనంపల్లి హనుమంతరావు కూడా ఒకరు.మల్కాజ్గిరి ( Malkajgiri ) లో టికెట్ కేటాయించారు కానీ, ఆయన కొడుకుకు మెదక్ టికెట్ కావాలని బీఆర్ఎస్ పై తిరుగుబాటు బాగుటా ఎగరరేశారు.

ఇక ఆయనే పార్టీ నుంచి బయటకు వచ్చేందుకే అనేక ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.ఇదే తరుణంలో ఆయన బిజెపిలో చేరుతారని అనేక వార్తలు వచ్చాయి.కానీ బిజెపి కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.

మైనంపల్లిని బిజెపిలో చేర్చుకునేది లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

హనుమంతరావు బిజెపిలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలపై స్పందించిన బిజెపి సీనియర్ నేత రామచంద్రరావు ( Ramachandra rao ) ఇలా మాట్లాడారు.గతంలో మైనంపల్లి తమ పార్టీ అగ్ర నేతలను దూషించారని, ఎంతోమంది కార్యకర్తలని జైలుకు పంపారని, అలాంటి నేతను బిజెపిలో చేర్చుకునేది లేదన్నారు.

Telugu Congress, Harish Rao, Medakmalkajgiri, Medchal, Mla Ticket, Ramachandra R

ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత బిజెపికి మైనంపల్లి దూరమైనట్టు తెలుస్తోంది.ఇక మిగిలి ఉన్న పార్టీ కాంగ్రెస్( Congress ) , ఇప్పటికే కాంగ్రెస్ తో మంతనాలు జరిపిన మైనంపల్లి రెండు సీట్లు అడిగినట్లు సమాచారం.కానీ కాంగ్రెస్ ఒకటే ఎమ్మెల్యే సీటు ఇస్తామని, మరొకటి పార్లమెంటు సీటు కోసం టికెట్ అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా మైనంపల్లి మల్కాజ్గిరి స్థానం నుంచి కాకుండా మేడ్చల్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరి చూడాలి మైనంపల్లి భవిష్యత్తు ఏ పార్టీలో దాగి ఉందో ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube