Nayani Pavani : బిగ్ బాస్7 కంటెస్టెంట్ నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) రసవత్తరంగా సాగుతోంది.

కొట్లాటలు గొడవలు ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది.

అంతేకాకుండా ప్రతి వారం కూడా ఊహించని విధంగా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులకు షాకిస్తున్నాడు.అయితే ప్రతి వారం ప్రేక్షకులు ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతోంది.

అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ చరిత్రలో ఎవరు ఊహించని విధంగా వరుసగా ఆరుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆరవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌( Wild Card Entry )లో భాగంగా హౌసులోకి అడుగుపెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని( Nayani Pavani ) ఎలిమినేట్ అయింది.హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారంలో తన ఆటతో ఆకట్టుకుంది.

Advertisement

కానీ అనుకోని విధంగా బయటకొచ్చేసింది.అయితే పావని ఎలిమినేషన్ ని ఎవరు ఊహించలేకపోయారు.

ఈ వారం ఏడుగురు నామినేట్ కాగా రెండు రోజులు ముందు వరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే శోభాశెట్టి, పూజామూర్తి, నయని పావని చివరి స్థానాల్లో ఉన్నారు.

వీళ్లలో చాలామంది శోభాశెట్టి( Shoba Shetty ) లేదా పూజామూర్తి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.కానీ వీళ్లిద్దరూ కాకుండా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది.అయితే గేమ్, టాస్కుల పరంగా ఈమెకి బలం ఉంది.

ఇంకో రెండు మూడు వారాలు ఉండుంటే రేసులో ఉండేదేమో.కానీ పరిస్థితులు అనుకూలించక వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ఇకపోతే ప్రస్తుతం పావని రెమ్యూనరేషన్ కి సంబంధించి అనేక రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.వారానికి రూ.2 లక్షలకు( Nayani Pavani Remuneration ) నయని పావని అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అంటే వచ్చిన వారం మాత్రమే ఉంది కాబట్టి కేవలం రూ.2 లక్షలు తీసుకుందట.

Advertisement

తాజా వార్తలు