Suma, Nagarjuna: బిగ్ బాస్ కొత్త ప్రోమో.. రచ్చ రచ్చ చేసిన నాగార్జున, సుమ.. వీడియో వైరల్?

తెలుగులో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

అందుకు సంబంధించి ఇప్పటికీ రెండు ప్రోమో లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

మొదటి ప్రోమోలో బిగ్ బాస్ లోగోని విడుదల చేయగా రెండో ప్రోమోలో నాగార్జున( Nagarjuna ) ఎంట్రీ ఇచ్చారు.బిగ్ బాస్ షో,మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉండగానే రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకు సంబంధించిన హంగామా అప్పుడే మొదలైంది.

అయితే బిగ్ బాస్ షో ప్రారంభం కాకముందే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ బిబి హౌస్‌మెట్స్’అంటూ ‘షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రోమో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఒకటి కాదు, రెండు కాదు బిగ్ బాస్‌లోని సిక్స్ సీజన్స్‌లో ఉన్న స్టార్స్ అందర్నీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సందడి చెయ్యబోతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షోలోకి బేబీ సినిమా టీం, స్లమ్‌డాగ్ హస్బండ్ టీమ్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్( Anil Ravipudi, Mehr Ramesh ) కూడా వీరితో కలిసి సందడి చేశారు.ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది.ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ పర్ఫార్మెన్స్‌ లతో అదరగొట్టేశారు.

Advertisement

బేబీ సినిమా విరాజ్ అశ్విన్, సుమ మెడలో దండేసి, ఆమెతో కలిసి డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారందరూ అరుస్తూ రచ్చ రచ్చ చేశారు ఇక తేజస్వి, మెహబూబా ఒక పాట చేశారు.ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే నాగార్జున ఎంట్రీ ఇచ్చాక ప్రోమో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

స్లమ్‌డాగ్ హస్బండ్ మూవీ( Slumdog Husband Movie ) హీరోయిన్ ప్రణవి మానుకొండ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో తన పక్కన బాలనటిగా చేసిందని చెప్పగానే ఈ పిల్ల పెద్దగా అయిపోయింది కానీ మనమిద్దరం ఇంకా అలాగే ఉన్నామంటూ నవ్వించింది సుమ.

తర్వాత వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) మస్తిష్టం మీరు నాకు అంటే నాగ్ హగ్ ఇవ్వమన్నారు.బీబీ 7 టీజర్‌లో( BB 7 Teaser ) కుడి ఎడమైతే అన్నారు.ఏంటి సార్? అని సుమ అడిగింది.ఓట్లు ఎలా కొట్టాలి, ఏంటి? అని కంప్లీట్ గేమ్ ప్లే అంతా మైండ్‌లో సెట్ చేసుకుని వస్తున్నారు.ఈసారి అవన్నీ కుదరవ్.

చూడు ఒకసారి, చూసిన తర్వాత మాట్లాడదాం అంటూ సీజన్ 7 ఎంత డిఫరెంట్‌గా, పార్టిసిపెంట్స్‌కి ఎంత టఫ్‌గా, ఆడియన్స్‌కి ఎంత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండబోతుందో చెప్పకనే చెప్తూ అంచనాలు అమాంతం పెంచేశారు నాగార్జున.మొత్తానికి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సెలబ్రెటీలు అందరూ కలిసి రచ్చ రచ్చ చేశారు.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు