పెదకాపు హీరో మూవీ బడ్జెట్ ఏకంగా 70 కోట్లా.. భారీ స్థాయిలో రిస్క్ చేస్తున్నారా!

తెలుగు ప్రేక్షకులకు హీరో విరాట్ కర్ణ( Hero Virat Karna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పెదకాపు( Peddha Kapu ) అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు విరాట్ కర్ణ. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ హీరోగా విరాట్ కి మాత్రం మంచి గుర్తింపు దక్కింది.

ఇది ఇలా ఉంటే విరాట్ కర్ణ తదుపరిచిత్రం నాగబంధం.( Naga Bandham ) తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలైన విషయం తెలిసిందే.క్లాప్ కూడా కొట్టారు.

ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాపై దాదాపు రూ.70 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌బోతున్న‌ట్టు టాక్.

Big Budget For Virat Karnas Nagabandham Details, Big Budget, Virat Karna, Naga B
Advertisement
Big Budget For Virat Karnas Nagabandham Details, Big Budget, Virat Karna, Naga B

అంతే కాకుండా ఇది ఇంకా పెరిగే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌.అయితే 70 కోట్లు ఎక్కువ అని అనుకుంటున్నా నేపథ్యంలో ఈ సినిమా పెట్టుబడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో ఈ సినిమా విషయంలో రిస్క్ చేస్తున్నారా అన్న అభిప్రాయాలు ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి.అయితే విరాట్ కర్ణ తొలి సినిమా పెద్దకాపు పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో పాటు ఆ సినిమాకు 40 కోట్ల బడ్జెట్ పెట్టగా అందులో పావు వంతు కూడా తిరిగి రాలేదు.

ఈ సినిమాపై ఇన్ని కోట్లా? అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ఈ చిత్రానికి అభిషేక్ నామా ద‌ర్శ‌కుత్వం వహిస్తున్నారు.

ఆయ‌న‌కూ ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా అనుభ‌వం లేదు.కాక‌పోతే క‌థ అంత ఖ‌ర్చు డిమాండ్ చేస్తోంద‌ని టాక్.

సోషియో ఫాంట‌సీ అంశాల‌తో ముడి ప‌డిన క‌థ ఇది.

Big Budget For Virat Karnas Nagabandham Details, Big Budget, Virat Karna, Naga B
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

సినిమా మొత్తం గ్రాఫిక్స్ తోనే న‌డుస్తుంద‌ట‌.ఇది ప‌ద్మ‌నాభ‌ స్వామి టెంపుల్ చుట్టూ సాగే క‌థ అని తెలుస్తోంది.ఈ దేవాల‌యం చుట్టూ ఎన్నో విచిత్ర‌మైన క‌థ‌లు వినిపిస్తుంటాయి.

Advertisement

ఆ క‌థ‌లకు ఇంకాస్త డ్రామా జోడించి ఈ సినిమా తీస్తున్నార‌ని స‌మాచారం.న‌భాన‌టేషా, ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారట.

ఆమె పేరు త్వ‌ర‌లో ప్ర‌క‌టించనున్నారట.ఈనెల 23 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుందట.

ఇందులో కొంత‌మంది పాన్ ఇండియా స్టార్లు కూడా క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం.

తాజా వార్తలు