బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు( KTR ) వరుసగా ఇబ్బందులే ఎదురవుతున్నాయి.అధికార పార్టీ కాంగ్రెస్ ను( Congress ) విమర్శించే క్రమంలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తిరిగి ఆయనే విమర్శలు పాలయ్యేలా చేస్తున్నాయి.
ఏ విషయంలోనూ కేసీఆర్ చేస్తున్న విమర్శలు వర్క్ అవుట్ కాకపోగా, తిరిగి ఆ విమర్శలు తనుకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.దీంతో కేటీఆర్ రాజకీయం పైన ఆ పార్టీ నేతల్లోనే అయోమయం నెలకొంది.
అమృత్ స్కీం స్కాం, మూసి ప్రక్షాళన, హైడ్రా విషయంలో కేటీఆర్ విమర్శలు రివర్స్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి. అన్ని విషయాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో పాటు , సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వేదికల పైన ఇదే విషయాన్ని పదేపదే చెబుతుండడం తో తిరిగి వాటికి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ కు నెలకొంది .కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది.అయితే ప్రస్తుతం చేసే పనులన్నీ ప్రజాభిష్టానానికి వ్యతిరేకంగా చేస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.
కానీ ఆ విమర్శలన్నీ రివర్స్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి.
అమృత్ స్కీం టెండర్లలో అవినీతి జరిగిందని, 3888 కోట్ల స్కాం జరిగిందంటూ కేటీఆర్ ఆరోపించారు .అయితే ఇందులో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది అయిన సుజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి 1,137 కోట్ల టెండర్లు కట్టబెట్టారంటూ కేపిఆర్ ఆరోపించారు.అయితే ఈ ఆరోపణల పై సుజన్ రెడ్డి స్పందించి కేటీఆర్ కు లీగల్ నోటీసులు అందించారు.
తన పరువుకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.కేటీఆర్ చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రతిసారి తమ ప్రత్యర్థ పార్టీలకు చెందిన నేతలకు లీగల్ నోటీసులు పంపే కేటీఆర్ కు సృజన రెడ్డి లీగల్ నోటీసులు పంపడం రాజకీయంగా చర్చనీయాంసంగా మారింది.బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
అమృత్ స్కీం టెండర్లపై( Amruth Scheme Tenders ) కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, సృజన రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని , తనకు అల్లుడు అవుతారని ఉపేందర్ రెడ్డి చెప్పడంతో కేటీఆర్ ఈ విషయం లో ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.
ఇక మూసి ప్రక్షాళన పై కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు.హామీల అమలు చేసేందుకు పైసలు లేవంటూ మూసి ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాడంట అంటూ విమర్శలు చేశారు.సంక్షేమ పథకాలు కోసం పైసలు ఇస్తే మీరు కమిషన్ లు ఇవ్వరు కదా, అదే మూసి ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్లు మింగవచ్చు అని ఫైర్ అయ్యారు .మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , 25 వేల నగదు, విద్యార్థులకు నాణ్యమైన విద్యా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.2017లోనే బీఆర్ఎస్ మూసి సుందరీకరణ కు రూపకల్పన చేసిందని, దానినే కొనసాగిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.దీంతో బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది.ఇలా ప్రతి విషయంలో కేటీఆర్ చేస్తున్న విమర్శలు పార్టీకి మేలు చేయకపోగా జనాల్లో బీ ఆర్ ఎస్ పార్టీ, కేటీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూనే ఉన్నాయి.