21న భారత్ బంద్ ఎల్లారెడ్డిపేట్ మండలం విజయవంతం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎస్సీ, ఎస్టీ లను వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు( Supreme Court) తీర్పుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 21న జరిగే భారత్ బంద్ ( Bharat Bandh)ను విజయవంతం చేయాలి.

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రసాదించిన హక్కులను కాపాడుకునేందుకు దేశంలోని అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు ఐక్యంగా కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ పోరాటంలో మనమందరం భాగస్వాములు కావలసిన అవసరం ఉంది.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, మోది సర్కారు రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగమే ఎస్సీ ఎస్టీ లో వర్గీకరణ అంశం .ఎస్సీ ఎస్టీ లను విభజించి పాలిస్తున్న బిజేపి ప్రభుత్వానికి బుధ్ధి చెప్పాల్సిన సమయం ఇది. సుప్రీం కోర్టు( Supreme Court) తీర్పు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.కాబట్టి ఎస్సీ ఎస్టీ విద్యార్థిని, విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ నేతలు, ఇతర పార్టీల నాయకులు అందరూ భారత్ బంద్ లో పాల్గొనాలి.21న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయండి.ఈ కార్యక్రమంలో ఎడ్ల రాజుకుమార్, రొడ్డ రామ చెంద్రం,గట్టిపెళ్లి రవీందర్, కోపెళ్ళి విజయ్ కుమార్, రేసు జగన్, గడ్డమీది సాయి చంద్,ఎడ్ల సందీప్,బండి హరికృష్ణ, గడ్డం జితేందర్, నిరటీ రాజు,బత్తుల నవీన్,తదితరులు పాల్గొన్నారు.

రాజన్న ఆలయ 26 రోజుల హుండీ ఆదాయం

Latest Rajanna Sircilla News