మీ ఇంట్లో అశుభాలను కలిగించే ఈ వాస్తు దోషాలతో జాగ్రత్త..!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) ఎక్కువగా నమ్ముతారు.

అంతే కాకుండా వారి ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

కానీ మనకు తెలియకుండానే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో వాస్తు దోషాలు ఉంటాయి.ఈ వాస్తు దోషాలే మన ఇంటికి అశుభ ఫలితాలను తీసుకొని వస్తాయి.

ఒకవేళ ఈ వాస్తు దోషాలను గుర్తించకపోతే ఆ ఇంటి కుటుంబ సభ్యుల లో సుఖసంతోషాలు దూరం అవుతాయి.హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.

వాస్తు శాస్త్రంలో ఉన్న నియమాలను పాటించడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తాయి.అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.

Advertisement
Beware Of These Vastu Doshas Which Cause Bad Luck In Your House , Vastu Doshas ,

ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు అస్సలు ఉండకూడదు.ఇది మీ ఇంటి కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది.

Beware Of These Vastu Doshas Which Cause Bad Luck In Your House , Vastu Doshas ,

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు ప్రధాన తలుపు( Main door ) ఎప్పుడు రిపేరి ఉండకూడదు.ఇంటి ప్రధాన తలుపులు ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే చేయించాలి.ఇంటి ప్రధాన ద్వారం దెబ్బ తినడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి.

కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ముందు భావి అస్సలు ఉండకూడదు.

ఒక వేళ ఇంటి ప్రధాన ద్వారం ముందు బావి ఉంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది.ఇది కుటుంబంలోని ప్రశాంతతను దూరం చేస్తుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

ఇంకా చెప్పాలంటే బరువైన వస్తువులను ఇంటికి నైరుతి దిశలో ఉండాలి.ఇంటికి నైరుతి దిశలో బరువైన వస్తువులు ఉండడం వల్ల రావు గ్రహానికి శాంతి జరుగుతుంది.

Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి దిశలో మరుగుదొడ్డిని అసలు నిర్మించకూడదు.ఇలా ఉండడం వల్ల ఆ కుటుంబంపై రాహువు ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

అంతేకాకుండా ఇంటి మధ్యలో ఖచ్చితంగా ఖాళీ స్థలం ఉండాలి.అందుకే మన పూర్వీకులు ఇళ్ల మధ్యలో కచ్చితంగా కాళీ ప్రదేశం ఉండేలా నిర్మించుకునేవారు.

తాజా వార్తలు