గ‌ర్భిణీలు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన కాల్షియం ఫుడ్స్ ఇవే!

గ‌ర్భిణీల‌కు కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో కాల్షియం ఒక‌టి.

క‌డుపులోని బిడ్డ‌ ఎముకలు, దంతాలు, కండ‌రాలు పుష్టిగా ఏర్పడేందుకు, గుండె ఆరోగ్యానికి, ఎదుగుద‌ల బాగుండేందుకు కాల్షియం ఎంతో అవ‌స‌రం.

అలాగే ఇటు త‌ల్లి ఆరోగ్యంగా ఉండాల‌న్నా కాల్షియం కావాలి.అందుకే ఆరోగ్య నిపుణులు గ‌ర్భిణీల‌కు రెగ్యుల‌ర్‌గా కాల్షియంను తీసుకోమ‌ని సూచిస్తుంటారు.

అలా అని కాల్షియం ఉన్న అన్ని ఫుడ్స్‌ను గ‌ర్భిణీలు తిన‌లేరు.మ‌రి ఏ ఏ ఫుడ్స్ వారు తీసుకోవ‌చ్చు? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ఖర్జూరాల్లో కాల్షియం కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.

కాబ‌ట్టి, గ‌ర్భిణీలు రెగ్యుల‌ర్ డైట్‌లో ఎండు ఖ‌ర్జూరాల‌ను చేర్చుకుంటే శ‌రీరానికి కాల్షియం అందుతుంది.పైగా ఎండు ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో వేధించే ర‌క్త హీన‌త స‌మ‌స్య సైతం ప‌రార్ అవుతుంది.

Best Calcium Foods For Pregnant Calcium Foods, Calcium, Foods, Calcium Foods Fo
Advertisement
Best Calcium Foods For Pregnant! Calcium Foods, Calcium, Foods, Calcium Foods Fo

ఆరెంజ్ పండ్ల‌లోనూ కాల్షియం ఉంటుంది.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ప్ర‌తి రోజు ఒక ఆరెంజ్ పండును తీసుకుంటే త‌ల్లికి, క‌డుపులోని బిడ్డ‌కి కావాల్సిన కాల్షియం ల‌భిస్తుంది.మ‌రియు ఆరెంజెస్‌లో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

అలాగే కాల్షియం అత్య‌ధికంగా ఉండే ఆహారాల్లో డ్రై ఆప్రికాట్లూ ఉన్నాయి.గ‌ర్భిణీలు వీటిని తీసుకుంటే కాల్సియంతో పాటు బిడ్డ ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఐర‌న్‌, ఫోలిక్ యాసిడ్ వంటి పోష‌కాలు కూడా పొందొచ్చు.

Best Calcium Foods For Pregnant Calcium Foods, Calcium, Foods, Calcium Foods Fo

ప్రెగ్నెంట్ మ‌హిళ‌లు ఓట్ మీల్ ద్వారా కూడా కాల్షియంను గెయిన్ చేయ‌వ‌చ్చు.పైగా బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్ మీల్ తీసుకుంటే అనేక పోష‌కాల‌తో పాటు శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.దాంతో మీరు రోజంత యాక్టివ్‌గా ఉండొచ్చు.

ఇక గ‌ర్భిణీలు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన కాల్షియం ఫుడ్స్‌లో కివి పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి, బాదం ప‌ప్పు, చేప‌లు, ఫిగ్స్‌, బ్రొకోలి, అలసందలు వంటివి కూడా ఉన్నాయి.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఇటువంటి కాల్ష‌యం ఫుడ్స్ తీసుకుంటే క‌డుపులోని శిశువు హెల్తీగా పెరుగుతుంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు