ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో బర్రె మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని(Ellareddypet Mandal) బండ లింగంపల్లి శివారులో విద్యుత్ షాక్ తో బర్రె మంగళవారం మృతి చెందినది.

నారాయణపూర్ గ్రామానికి చెందిన జెల్ల తులసి రైతుకు చెందిన బర్రె మేయడానికి నారాయణపూర్ బండలింగంపల్లి వాగు మధ్యలో గల శివారులోకి మేతకు వెళ్ళింది.

వ్యవసాయ పొలం దగ్గర సర్వీస్ వైరు కాళ్లకు చుట్టుకోవడంతో విద్యుత్ షాకి తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతులు తెలిపారు.సుమారు 60 వేల రూపాయల విలువ గల బర్రె మృతి చెందడంతో రైతు ఆవేదన చెందారు సెస్ లైన్మెన్ సత్తయ్య పశు వైద్యాధికారి పరీక్షలు నిర్వహించారు.

సెస్ పరంగా రైతుకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

మైనర్ డ్రైవింగ్ చేస్తూ వ్యక్తి మరణానికి కారణం-మైనర్ తల్లిపై కేసు నమోదు రిమాండ్ కి తరలింపు.
Advertisement

Latest Rajanna Sircilla News