చిరంజీవి ఫ్యాన్ కు బాలయ్య ఫ్యాన్ సాయం..!

టాలీవుడ్ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి నట జీవితం లోనే కాకుండా, నిజ జీవితంలో కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.

సహాయం చేయడానికి చిరంజీవి వెనకాడని వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

ఇక చిరంజీవికి ఉన్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు.అంతేకాకుండా ఈయన సోషల్ మీడియాలో కూడా కొన్ని విషయాలు, సూచనలు తెలుపుతుంటారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ఫ్యాన్ కు బాలయ్య ఫ్యాన్ సాయం అందించిన విషయం అందరిని మెప్పిస్తుంది.గత కొన్ని రోజులుగా కడప జిల్లాకు చెందిన ఓ మెగా అభిమాని పి సురేష్ అనే వ్యక్తి కొన్నాళ్ళు నుండి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా.

చిరంజీవి ఆయనకు లక్ష రూపాయల సహాయం చేశాడు.అంతేకాకుండా చిరంజీవి మరో వ్యక్తి సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ నాయుడు అనారోగ్య సమస్యతో బాధ పడగా ఆయన వెన్నంటే ఉండి వైద్య సేవలు అందించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక సురేష్ కు చిరంజీవి కాకుండా.మరో స్టార్ అభిమాని కూడా సహాయం అందించాడు.కడప నందమూరి బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షుడు పీరయ్య.

సురేష్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి 20 వేల రూపాయలు సహాయాన్ని చేసి గొప్ప మనసు చాటుకున్నారు.వీరయ్య సహాయం గురించి చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

ఇక సురేష్ అఖిల భారత చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు.ఇదే కాకుండా కడప జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.

ఈయన ఈ సంస్థలకు ఎన్నో సేవలు కూడా అందించాడు.అంతేకాకుండా చిరంజీవి పేరు మీద కూడా కొన్ని సేవలను అందించాడు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు