బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల కు రాజ్యాధికారం అందించే దిశగా అడుగులు వేస్తుంది : రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఇల్లంతకుంట మండలలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్,బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు అమర్ ఆధ్వర్యంలో మండల కేంద్రము లో నీ వైష్యా భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు.

ఇట్టి సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మానకొండూరు అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జి రంగు సంపత్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ అర్.

ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి రూపొందించిన బహుజన మేనిఫెస్టోని ప్రజలు ఆదరించాలని కోరారు.మిగతా మూడు పార్టీల మేనిఫెస్టో లు రాజ్యాంగ వ్యతరేకంగా ఉన్నాయని అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ( Bahujan Samaj Party ) బహుజనుల కు రాజ్యాధికారం అందించే దిశగా అడుగులు వేస్తుందని,నవంబర్ రాబోయే ఎన్నికల్లో మానకొండూరు ఎమ్మెల్యే అభ్యర్థి అడ్వకేట్ నిషాని రామచంద్రంని గెలిపించాలని మండల ప్రజలను కోరారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంద బాలయ్య,జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల లింగన్న పటేల్, మానకొండుర్ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి నిషాని రామచంద్రం,అసెంబ్లీ అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్ ,మండల అధ్యక్షుడు అమర్,ప్రధాన కార్యదర్శి రాయినిపట్ల రాజ్ కుమార్,కార్యదర్శి పల్లె మీది శ్రీను,కోశాధికారి జుట్టు విజయ్ కుమార్,సావనపెల్లి రాములు,ఆర్గనైజింగ్ సెక్రటరీ కాసుపాక శ్రీనివాస్,బూత్ అధ్యక్షులు గజ్జెల శశి కుమార్,పశుల శ్రావణ్,దమ్మని హరీష్,అరుణ్,నరేష్,చిట్యాల అశోక్, కాసుపాక మధు,తడ్కపెళ్ళి శ్రీకాంత్ ముఖ్య కార్యకర్తలు అందరూ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News