పెద్దబోనాల కస్తూర్బా గాంధీ హైస్కూల్లో షీ టీం పై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని పెద్దబోనాల వద్ద గలా కస్తూర్బా గాంధీ హై స్కూల్లో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు షీ టీమ్ ఉపయోగాలు,సైబర్ క్రైమ్,డయల్100,గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల మీద అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్.

ఐ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు హక్కులు,రక్షణకు షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు.విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన,ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని స్కూల్లో, కళాశాలలో, బస్టాప్ ఇతర నిర్మాణ ప్రాంతాలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712656425 కు లేదా డయాల్ 100 కు కాల్ చేయాలన్నారు.

అదే విధంగా షీ టీం యెక్క పని విధానం,పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్,గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అమ్మాయిల వేధింపులు, పై అవగాహన కల్పించడం జరిగింది.విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురి అయినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు.

సైబర్ నేరాల గురించి విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ డబ్ల్యూ ఏ ఎస్ ఐ ప్రమీల,షీ టీమ్ సిబ్బంది, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం :    నంద్యాలలో లోకేష్ .. జగన్ ఎక్కడంటే 

Latest Latest News - Telugu News