ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా :రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ( SP Akhil Mahajan )ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ వారి సహకారంతో వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి ముందు ట్రాఫిక్ రూల్స్ పై, ఫ్లాష్ మొబ్ అండ్ అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వేములవాడ ట్రాఫిక్ ఆర్ ఎస్సై దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు నిబంధనలు పాటించాలని,ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయరాదని, రోడ్డు నిబంధనలు పాటించి వారి ప్రాణాలను రక్షించుకోవాలని వారి కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవాలని పేర్కొనడం జరిగింది.

Latest Rajanna Sircilla News