కామన్వెల్త్ గేమ్స్ షెడ్యూల్ ప్రకారం 2026 లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం( Victoria ) కామన్వెల్త్ క్రీడలకు వేదిక అవ్వాల్సి ఉంది.అయితే తాము ఈ కామన్వెల్త్ క్రీడలను( Commonwealth Games 2026 ) ఉంచలేమని విక్టోరియా తేల్చి చెప్పేసింది.
క్రీడలను నిర్వహించలేక పోవడానికి ప్రధాన కారణం నిర్వహణ ఖర్చు.మొదట కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణకు రెండు బిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
మన భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష 12 వేల కోట్ల రూపాయలు. కానీ తాజా లెక్కల ప్రకారం ఇందుకు 3.5 రెట్లు నిర్వహణ ఖర్చు భారీగా పెరిగిపోయింది.అంటే ఏకంగా ఏడు బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు నిర్వహణ ఖర్చు అవ్వనుంది.
మన భారత కరెన్సీ ప్రకారం 3 లక్షల 72 వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది.
విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం కేవలం క్రీడల నిర్వహణ కోసం ఇంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అని ఎన్నో చర్చలు, ఎన్నో సమావేశాలు నిర్వహించి తాము ఈ క్రీడలను నిర్వహించలేమని తేల్చి చెప్పేసింది.
అంచనా వేసిన వ్యయం కంటే మూడు రెట్లు నిర్వహణ ఖర్చు పెరగడంతో కామన్వెల్త్ గేమ్స్ అధికారులకు ఈ విషయాన్ని విక్టోరియా తెలిపి తాము అధిత్యం ఇవ్వలేమని కాంట్రాక్టుని రద్దు చేయాల్సిందిగా కోరారు.ఈ విషయాన్ని స్వయంగా మేల్ బోర్న్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియల్ అండ్రుస్ తెలియజేశాడు.

అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు కామన్వెల్త్ గేమ్స్ 2026 లో 20 ప్రధాన క్రీడలు, మరో 26 పోటీలను విక్టోరియా లోని గీలాంగ్, బల్లారత్, బెండిగో, గిప్స్ లాండ్, షెప్పర్టన్ లలో నిర్వహించాలని భావించారు.మరో కోణంలో కేవలం మేల్ బోర్న్ లోనే( Melbourne ) పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని అంచనా కూడా వేశారు.ఎలా ప్లాన్ చేసిన నిర్వహణ ఖర్చు తగ్గకపోవడంతో ఈ క్రీడలను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఒకవేళ ఈ కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహించడానికి ఏ దేశం కూడా ముందుకు రాకపోతే కొన్ని వేలమంది అథ్లెట్ల ఆశలపై నీళ్లు చల్లినట్టే.14 నెలల క్రితం కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులను తీసుకున్న విక్టోరియా చేతులు ఎత్తేయడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది.