నిరసన కాస్తా ఓవర్ యాక్షన్ అయిందిగా ? చిక్కుల్లో కాంగ్రెస్ నేతలు ?

నిన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేధిస్తున్నారంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

దీనిలో భాగంగానే తెలంగాణా కాంగ్రెస్ నేతలు గత కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమం కాస్త ఉద్రిక్తతలకు దారి తీయడంతో పాటు పోలీసులపైనే కాంగ్రెస్ నేతలు కొంతమంది దాడులకు పాల్పడడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటారని ముందే పసిగట్టిన కాంగ్రెస్ నేతలు సరికొత్త విధంగా ప్లాన్ చేశారు.

నిన్న తెల్లవారుజామున ఎన్ఎస్ యూఐ విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడించారు.ఆ తరువాత పది గంటలకు ఇతర నేతలు రాజ్ భవన్ మ ముట్టడించారు అయినా పోలీసులు వారిని కాంగ్రెస్ నేతల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Advertisement
As The Protest Became Somewhat Over Action , Congress Leaders In Trouble , Tela

ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి మహిళా ఎస్ఐని డొక్కలో తన్నడం , మరో ఎస్సై చొక్కా పట్టుకుని హెచ్చరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

తనను అరెస్టు చేసేందుకు టచ్ చేస్తే స్టేషన్ కు వచ్చి కొడతాను అంటూ ఆమె హెచ్చరించారు. 

As The Protest Became Somewhat Over Action , Congress Leaders In Trouble , Tela

అలాగే కాంగ్రెస్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఓ డిసిపి కాలర్ పట్టుకున్నట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు.కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జి చేయడమే కాకుండా దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

అంతేకాదు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.చివరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన రేణుకా చౌదరి పైన కేసులు నమోదు చేయడం వంటివి హాట్ టాపిక్ గా మారాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఫోర్బ్స్ జాబితా ...రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా... బాగానే వెనకేసిన నటి!

కాంగ్రెస్ నేతలు రాయల్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టి తమదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేసి ఉంటే పోలీసులు ఎలాగూ వాటిని అడ్డుకోవడం, స్టేషన్ కు తరలించి వదిలి వేయడం వంటివి జరిగేవి.కానీ పోలీసుల డొక్కలో తన్నడం, కాలర్ పట్టుకుని హెచ్చరికలు చేయడం,  హెచ్చరికలు చేయడం వంటి అతి కారణంగానే కేసుల వరకు కాంగ్రెస్ నేతలు పరిస్థితిని తెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు