పెరుగులో తేనె కలిపి తీసుకుంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

సాధారణంగా చెప్పాలంటే పెరుగు తేనెలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి.ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.

రోజు పెరుగును తింటే జలుబు, అలర్జీ, తుమ్ములు వంటి సమస్యల ప్రమాదం దూరం అవుతుంది.ఇంకా చెప్పాలంటే పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పెరుగులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే పెరుగును సీజన్ తో సంబంధం లేకుండా తినవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే వానాకాలం చలికాలంలో మధ్యాహ్నం పూట పెరుగును తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.పెరుగులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

పెరుగు గొప్ప ప్రోబయోటిక్ ఆహారం.

దీనిలో విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.పెరుగులో విటమిన్ బి2, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.రోజు పెరుగును తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి ( Immune System )పెరుగుతుంది.

అలాగే తుమ్ములు, జలుబు( Cold ) వంటి అలర్జీ వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.మీరు రోజు పెరుగును తింటే మీ జీర్ణ క్రియ( Digestion ) మెరుగు పడుతుంది.

అలాగే కడుపు అసౌకర్యం కూడా తగ్గుతుంది.అంతే కాకుండా పెరుగు మీ ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

అయితే పెరుగులో కాస్త తేనెను వేసి తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.పెరుగులో లాగే తేనెలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.

Advertisement

తేనె( Honey )లో విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వివిధ రకాల ఎంజైమ్లు ఉంటాయి.తేనే ను పెరుగులో కలిపి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.మన పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అందుకే ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.తేనెలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

తేనే కూడా జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇవి శరీరంలో కొవ్వు పేరుకోపోకుండా నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు