ఏపీ మంత్రివ‌ర్గంలో మార్పులు అప్ప‌టి దాకా లేన‌ట్టేనా...?

ఏపీ రాజ‌కీయాల్లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశం ఎంత హాట్ టాపిక్ గా న‌డుస్తుందో అంద‌రికీ తెలిసిందే.

ఇక అధికార వైసీపీ పార్టీలో అయితే ఈ అంశం మీద జోరుగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

ఇది వ‌ర‌కే ఆశ‌లు పెట్టుకున్న వారంతా కూడా జ‌గ‌న్ పాల‌న రెండున్న‌రేండ్లు జ‌రిగిన నేప‌థ్యంలో ఎలాగైనా మంత్రి వ‌ర్గ మార్పు ఉంటుంద‌ని అంతా ఆశ‌లు పెట్టుకుంటున్నారు.ఇదే విష‌యం అటు మంత్రుల ముఖాల్లో తీవ్ర నిరాశ‌ను తీసుకొచ్చింది.

తము మంత్రి ప‌ద‌వి పోతోంద‌న్న వాద‌న అప్పుడే వారిని తీవ్ర బాధ, ఆవేదనలో ప‌డేసింది.ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు పలానా మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌దంటూ చెప్పేయ‌డంతో వారంతా కూడా తీవ్ర నిరాశ‌లోనే ఉన్నారు.

త‌మ ప‌ద‌వులు పోతున్నాయ‌న్న బాధ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ఇక శాఖల ప‌నితీరు మీద కూడా వ‌రు ఎలాంటి ఫోక‌స్ పెట్ట‌లేక‌పోతున్నారు.

Advertisement
Are There Any Changes In The AP Cabinet Till Then . AP Cabinet, Jagan, Ysrcp ,

ఇక ఎన్ని రోజులు ప‌డుతుందో తెలియ‌క వారంతా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.అయితే ఇప్పుడు వారికి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోందంట‌.

మంత్రి వర్గ విస్తరణపై జ‌గ‌న్ ఎలాంటి గ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌ట్లేద‌ని అవ‌న్నీ కేవ‌లం మీడియాలో వ‌స్తున్న వార్త‌లే అని తెలుస్తోంది.

Are There Any Changes In The Ap Cabinet Till Then . Ap Cabinet, Jagan, Ysrcp ,

అటు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంటే రాష్ట్రంలో ఉన్న ఇలాంటి ప‌రిస్థితుల్లో అది సాధ్యం కాక‌పోవ‌చ్చ‌నే చెప్పాలి.లాజిక్ తో ఆలోచిస్తే మాత్రం జ‌గ‌న్ కూడా దీనిపై వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు స‌మాచారం.ఎందుకంటే తాను మంత్రుల‌ను మారిస్తే గ‌తంలో ఎన్టీఆర్ లాంటి వారికి ఎదురైన ప‌రాభ‌వ‌మే ఎదుర‌య్యే అవకాశం ఉంద‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డారంట‌.

ఇదంతా కూడా మంత్రుల‌కు కలిసి వ‌చ్చే అంశం.పైగా సామాజిక వ‌ర్గాల విభేదాలు కూడా వ‌చ్చే అవకాశం ఉంటుంది కాబ‌ట్టి జ‌గ‌న్ దీనిపై ఎక్కువ‌గా దృస్టి సారించ‌లేక‌పోతున్న‌ట్టు తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు