ఏపీ కి స్పెషల్ స్టేటస్ విషయంలో ఏపీ హైకోర్టు.. కేంద్రానికి నోటీసులు..!!

రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలు కావచ్చు కానీ ఇప్పటివరకు విభజన చట్టం ప్రకారం ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా ఇంకా రాలేదన్న సంగతి తెలిసిందే.

ప్రత్యేక హోదా అడ్డంపెట్టుకుని చాలా పార్టీలు రాజకీయాలు కూడా చేశాయి.

పరిస్థితి ఇలా ఉంటే.ఏపీ హైకోర్టు తాజాగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేయడం జరిగింది.

AP High Court Issues Special Status To AP Notices To The Center, Andhra Pradesh,

ప్రత్యేక హోదా ఇవ్వక పోవడానికి కారణాలు ఏమిటో తెలియజేయాలని కేంద్రాన్ని తాజాగా హైకోర్టు వివరణ కోరింది.ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినపుడు ఎందుకు ఏపీకి ఇవ్వలేదో తెలియజేయాలని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరాలు అందించాలని పేర్కొంది.అనంతరం డిసెంబర్ 20వ తారీకుకి వాయిదా వేయడం జరిగింది.

Advertisement

అమలాపురం కి చెందిన న్యాయవాది రాజేష్ చంద్ర వర్మ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి.ఇప్పుడు అమలు చేయడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ హైకోర్టు లో తాజాగా విచారణకు రావటంతో.హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు