Group1 Mains Exam : గ్రూప్-1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి స్వల్ప ఊరట లభించింది.

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు( Group 1 Mains Exam Cancellation )పై హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలికంగా హైకోర్టు స్టే విధించింది.అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.

అయితే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష( Group 1 Mains Exam ) రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.కాగా రెండు సార్లు మూల్యాంకనం చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్ బెంచ్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కొనసాగుతారని స్పష్టం చేసింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు