కల్కి టికెట్ల రేటు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ప్రతి ఏరియాలో కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి.ఇక కల్కి సినిమా టికెట్ల రేట్లు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని తెలియజేశాయి.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.

ఇకపోతే ఏపీలో గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల రేట్లను( Ticket Cost ) భారీగా తగ్గించారు.అలాగే అదనపు షోలకు కూడా అనుమతి ఇవ్వలేదు.తద్వారా చిత్ర పరిశ్రమ ఎంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.

Advertisement

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరోసారి చిత్ర నిర్మాతలందరూ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను కలిశారు.

ఇలా నిర్మాతలతో భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల విషయంలోనూ అలాగే అదనపు షోల విషయంలోనూ సంచలన నిర్ణయం తీసుకుంది.కల్కి సినిమా టికెట్ల రేట్లను కూడా పెంచడమే కాకుండా అదనపు షోలకు కూడా అనుమతి తెలిపింది.రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లలో 125 రూపాయలు పెంచటానికి అనుమతి తెలిపింది.

ఇక రోజుకు ఐదు షోలు వేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపింది.ఇలా సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో చిత్ర నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏపీలో కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభం కానున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?
Advertisement

తాజా వార్తలు