జగన్ కు నిరాశే ! దెబ్బేసిన వాలంటీర్స్ ? 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రజలకు నేరుగా ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.

ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం అయినా, మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండానే నేరుగా లబ్ధి దారులకు అందే విధంగా వాలంటీర్లు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారు.ఇలాంటి వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలు ప్రభుత్వం కు కూడా ఎంతో సౌకర్యం గా ఉంది.

మొదట్లో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్న సమయంలో అందరిలోనూ అనుమానంతో పాటు జగన్ ప్రభుత్వం ను ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేశాయి.అయినా  రెండు లక్షలకు పైగా వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేసి, వారికి గౌరవ వేతనం కింద 5000 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తున్నారు.

ఇక ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి వెళ్లడం, వారికి సౌకర్యంగా ఉండటం వంటి కారణాలతో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు పొందింది.మిగతా రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాలలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సులువుగా అందించే ఏర్పాట్లను చేసుకున్నాయి.ఇదంతా జగన్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాయి.

Advertisement

టిడిపి ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ఇదేవిధమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా, ఎన్నో విమర్శలు వచ్చాయి.అవినీతి అక్రమాలకు నిలయంగా జన్మభూమి కమిటీ లు నిలిచాయి.

చివరకు ఆ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబు జన్మభూమి కమిటీలు రద్దు చేసినా, చివరకు ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.కానీ జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ దానికంటే భిన్నంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

రేపో మాపో వాలంటీర్లకు జీతాలు పెంచబోతున్నారు అనే వార్తలు వస్తున్న సమయంలోనే, వారు జీతాలు పెంచాలంటూ ఆందోళనకు దిగడం సంచలనం రేపుతోంది.అది కూడా ఏపీలో హోరాహోరీగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సమయంలోనే.

ఇది ఎంతో కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమే.జీతాలు పెంచాలని కోరడం తప్పేమీ కాకపోయినా, జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఇలా రోడ్డెక్కి రచ్చ చేయడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 
Advertisement

తాజా వార్తలు