న్యూస్ రౌండప్ టాప్ 20

1.పెద్దపులి సంచారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

పెద్ద పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

2.ఆర్ఎస్ బ్రదర్స్ లో ఐటీ సోదాలు

 

అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ లో ఐటి సోదాలు కలకలం రేపుతున్నాయి.ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 

3.గ్రీన్ మంకీ పబ్ పై కేసు నమోదు

  హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు సౌండ్ బాక్స్ పెట్టి శబ్ధం చేస్తున్న గ్రీన్ మంకీ పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

4.నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు భారీగా వరద

 

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో ప్రాజెక్టు కు ఉన్న 18 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

5.తెలంగాణకు రాహుల్ పాదయాత్ర

  కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఈనెల 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. 

6.బండి సంజయ్ రోడ్ షో

 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 18వ తేదీన మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. 

7.కాలేశ్వరంపై విచారణ జరిపించాలి

  కాలేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం చైర్మన్ రణధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

8.కోటి టన్నుల ధాన్యం టార్గెట్

 

Advertisement

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు టార్గెట్ కోటి టన్నులుగా పెట్టుకున్నామని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 

9.నేటి తో ముగియనున్న నామినేషన్ ల గడువు

  హుజురాబాద్ ఓపెన్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు నేటితో గడువు పూర్తి కానుంది. 

10.ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర

 

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు ఏపీలోకి ప్రవేశించింది. 

11.టిడిపి లీగల్ సెల్ సమావేశం ప్రారంభం

  టిడిపి లీగల్ సెల్ సమావేశం టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. 

12.ఒంగోలు అత్యాచార ఘటనపై హోం మంత్రి ఆరా

 

ఒంగోలు అత్యాచార ఘటనపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఆరా తీశారు. 

13.చంద్రబాబు హెచ్చరిక

  గుర్తుపెట్టుకోండి చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి.మీ గుండెల్లో నిద్రపోతా తప్పు చేసిన వారు ఎవరిని వదిలిపెట్టబోనని టిడిపి అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 

14.అమరావతి లో సోము వీర్రాజు పర్యటన

 

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటిస్తున్నారు. 

15.సోమశిల జలాశయానికి వరద ఉధృతి

 సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా ప్రాజెక్టుకు 31 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. 

16.తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు పునరుద్దరణ

 

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

తిరుపతి - హుబ్లీ మధ్య ప్యాసింజర్ రైలు రాకపోకలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

17.మహా పాదయాత్ర పై రోజా కామెంట్స్

  దొంగ రైతులతో అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారని ఏపీ మంత్రి రోజా విమర్శించారు. 

18.ప్రధానికి అమరావతి జేఏసి చైర్మన్ లేఖ

 

Advertisement

ప్రధాని నరేంద్ర మోదీకి అమరావతి జేఏసీ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి లేఖ రాశారు.అమరావతి మహా పాదయాత్ర ను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని లేఖ రాశారు. 

19.స్విమ్స్ పథకాలకు కోటి విరాళం

  టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆసుపత్రి పథకాలకు కోటి విరాళం గా అందింది.అమెరికాలో ఉంటున్న డేగా వినోద్ కుమార్ , రాధికా రెడ్డి దంపతులు ఈ విరాళాన్ని అందించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,750   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,000.

తాజా వార్తలు