న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఫామ్ హౌజ్ నుంచి ప్రగతి భవన్ కు కేసీఆర్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ కు చేరుకున్నారు.

గత నెల 29 నుంచి ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ లో ఆయన ఉన్నారు. 

2.టి పి సి సి కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

  టీ పిసిసి కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గాంధీభవన్ లో జరగనుంది. 

3.తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. 

4.బండి సంజయ్ కు ప్రధాని ఫోన్

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కష్టపడి పని చేస్తున్నారని ప్రధాని మోదీ ఫోన్ లో ప్రశంసించినట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 

5.జగన్ కు లోకేష్ లేఖ

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.ఈ లేఖలో ఏపీకి సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించారు. 

6.తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వానలు

  ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో ఈ ప్రభావంతో రాగల నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

7.మంత్రి అంబటి రాంబాబు పేరుతో ఆడియో వైరల్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

ఏపీ మంత్రి అంబటి రాంబాబు అయ్యన్నపాత్రుడు మధ్య వార్ కొనసాగుతోంది.తాజాగా అంబటి రాంబాబు రాసలీలలు పేరుతో ఆడియో విడుదల చేయడంతో అది వైరల్ అయ్యింది. 

8.ఏపీలో సబ్సిడీపై విద్యుత్

 

ఏపీలో రైతులందరికీ 1.5 కే సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేయబోతున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. 

9.విద్యుత్ శాఖ కార్యాలయం లో భారీ అగ్నిప్రమాదం

  నిజామాబాద్ జిల్లా ఆర్మూరు లోని విద్యుత్ శాఖ ఆఫీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఫైల్స్ ఫర్నిచర్ మంటల్లో దగ్ధమయ్యాయి.ఈ ఘటనలో 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 

10.వైసీపీ ఎమ్మెల్యే పై గవర్నర్ కు ఫిర్యాదు

  కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. 

11.మహానాడు నిర్వహణపై చంద్రబాబు సమీక్ష

 

త్వరలో జరగబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. 

12.టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై జనసేన ఆగ్రహం

  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పై జనసేన కీలక నాయకుడు కిరణ్ రాయల్ విమర్శలు చేశారు.టిటిడి లో ఏదో జరుగుతోందని అందుకే అకస్మాత్తుగా జవహర్ రెడ్డి ని బదిలీ చేశారని కిరణ్ రాయల్ అనుమానం వ్యక్తం చేశారు. 

13.రాగల 24 గంటల్లో ఏపీ లోకి రుతుపవనాలు

 

రాగల 24 గంటల్లో ఏపీ లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

14.జగన్ కీలక వ్యాఖ్యలు

 ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని జగన్ వ్యాఖ్యానించారు. 

15.బీజేపీకి రావెల కిషోర్ బాబు రాజీనామా

 

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బిజెపికి రాజీనామా చేశారు.ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కు లేఖ పంపించారు. 

16.భద్రాద్రి ఆలయానికి భారత్ బయోటెక్ భారీ విరాళం

  భద్రాద్రి ఆలయానికి భారత్ బయోటెక్ కంపెనీ కోటి విరాళాన్ని అందించింది. 

17.అకాల వర్షంతో పంట నష్టం పై కేటీఆర్ ఆరా

 

Advertisement

ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో నిన్న రాత్రి ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం పై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. 

18.తిరుమల సమాచారం

  తిరుమలలో అష్టదళ పాదపద్మారాధన సేవలను పునరుద్ధరించారు.తిరుప్పావడ సేవ టిక్కెట్లు ఉన్నవారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. 

19.బాలయ్య చేతుల మీదగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

 

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను నటుడు,  హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించనున్నారు. 

20.బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46, 250   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,450.

తాజా వార్తలు