న్యూస్ రౌండప్ టాప్ 20

1.పొంగులేటి పై పువ్వాడ అజయ్ విమర్శలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై మంత్రి పువ్వాడ అది తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

డబ్బు బలం చూసుకుని పొంగులేటి విర్ర వీగుతున్నారని అజయ్ మండిపడ్డారు.

2.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జెడిఎస్ లకు కెసిఆర్ నిధులు సమకూర్చారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

3.అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ .సుప్రీం నిరాకరణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణకు సుప్రీం వెకేషన్ బెంచ్ నిరాకరించింది.

4.పేర్ని నాని సంచలన కామెంట్స్

త్వరలోనే రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నానని, ఏపీ సీఎం జగన్ సమక్షంలో మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.

5.సినీ నటుడు శరత్ బాబు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఈరోజు మృతి చెందారు.

6.జి 20 సదస్సులో పాల్గొనబోతున్న రామ్ చరణ్

జి 20 సదస్సులో ఫిలిం టూరిజం, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటు అయిన 17 దేశాల సభ్యులు ఉన్న ప్యానల్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు.

7.తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Advertisement

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

8.పొంగులేటి కామెంట్స్

9 ఏళ్ల పాలనలో కెసిఆర్ కు బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని తెలంగాణ ప్రభుత్వం పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతోనే, కేసీఆర్ బీసీల ప్రస్తావన తీసుకువచ్చారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

9.ఏపీలో బీ ఆర్ ఎస్ ఫ్లెక్సీ ల చించివేత

గుంటూరు జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారు.దీనిపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

10.ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం

ఏపీలో  పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.కడప జిల్లాలో గాలి బీభత్సనికి ఒకరు మరణించారు.

11.జగన్ పాలనపై చార్జిషీట్ విడుదల చేస్తాం

వైసిపి పాలనలో అక్రమాలు, అరాచకాలు పెరిగాయని ,జగన్ పాలనపై త్వరలోనే చార్జిషీట్ విడుదల చేస్తామని బిజెపి నేత విష్ణుకుమా రాజు అన్నారు.

12.  ఏపీ పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ మహాసభ పోస్టర్ రిలీజ్

ఏపీ పి టి డి ఎంప్లాయిస్ యూనియన్  27వ మహాసభ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

13.ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడి విమర్శలు

తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ పనిచేస్తున్నారని, ప్రతిరోజు ఒక కంపెనీ వచ్చేలా కృషి చేస్తున్నారని  ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రశంసించారు ఇక ఏపీ రాజధాని ఏది అంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని కేసీఆర్, కేటీఆర్ లను చూసి నేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వంపై చంద్రశేఖర్ విమర్శలు చేశారు.

14.బందర్ పోర్టుకు నేడు శంకుస్థాపన

బందరు పోర్ట్ నిర్మాణానికి ఈరోజు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

15.సోము వీర్రాజు కామెంట్స్

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

2000 నోటు రద్దు నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

16.సిపిఐ నారాయణ కామెంట్స్

దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ పనిచేశారని ఆ కుటుంబంపై మోడీ కక్ష సాధిస్తున్నారని సిపిఐ నారాయణ విమర్శించారు.

17.తిరుమల సమాచారం

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

18.రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.రేవంత్ రెడ్డి వచ్చినా ఆయన బిజెపిలో చేర్చుకోమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

19.నేడు టిటిసి విస్తృత సమావేశం

టీ పీసీసీ విస్తృత సమావేశం నేడు గాంధీభవన్ లో జరగనుంది.దీనికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ,-56,290 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -;61,310 .

తాజా వార్తలు