పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న వార్తలను నిజం చేస్తూ ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.
కాగా బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు పవన్.ఈ సినిమాలో పవన్ గెటప్ మామూలుగానే ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఇప్పటికే నివేదా థామస్ మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా మరో హీరోయిన్‌గా అంజలి ఎంపికైనట్లు వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదంటూ అంజలి పాప కొట్టిపారేసింది.
పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని తనను ఎవరూ సంప్రదించలేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకువస్తాయని ఆమె మండిపడింది.దీంతో ఈ సినిమాలో అంజలి నటిస్తోందనే వార్త గాలివార్తగానే మిగిలిపోయింది.
ఇక ఈ సినిమా షూటింగ్‌లో పవన్ నిరవధికంగా పాల్గొని సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.మరి ఈ సినిమాలో అంజలి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy