14 నుంచి ఎనీమియా నిర్ధారణ పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన 587 అంగన్వాడి కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, బాలికలు, పిల్లలకు ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, డీఆర్డీఓ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టనుంది.

ఎనీమియా లోపంతో జిల్లాలో గర్భిణులు, బాలింతలు, బాలికలు, పిల్లలు ఉండకూడదనే సదుద్దెశంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతుంది.ఐదు రోజులు.587 కేంద్రాలు.ఈ నెల 14, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాలోని సిరిసిల్ల, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్ మండలాల్లో పరీక్షలు చేయనున్నారు.54,276 మందికి.సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలో మొత్తం గర్భిణులు, బాలింతలు, 0-6 ఏండ్ల లోపు పిల్లలు, 10-19 ఏండ్ల లోపు బాలికలు మొత్తం 34, 267 మంది ఉన్నారు.

వేములవాడ ప్రాజెక్టు పరిధిలో మొత్తం గర్భిణులు, బాలింతలు, 0-6 ఏండ్ల లోపు పిల్లలు, 10-19 ఏండ్ల లోపు బాలికలు మొత్తం 20,009 మంది ఉన్నారు.ఏఎన్ఎంలు, ఆశాల ఆద్వర్యంలో.

గర్భిణులు, బాలింతలు, 0-6 ఏండ్ల లోపు పిల్లలు, 10-19 ఏండ్ల లోపు బాలికలకు ఆయా అంగన్వాడి కేంద్రాల వద్ద ఏఎన్ఎంలు, ఆశాల ఆద్వర్యంలో ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేయాలని, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించాలని, శిబిరాల సమాచారం విద్యా శాఖ సీఆర్పీలు లబ్ధిదారులకు చేరవేయాలని సూచించారు.

Advertisement
వైరల్.. గోరుపై నెహ్రూ చిత్రపటం

Latest Rajanna Sircilla News