రెండో బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య... హోలీ సందర్భంగా జెండర్ రివీల్‌

యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

బుల్లి తెరతో పాటు వెండి తెర పై కూడా అప్పుడప్పుడు కనిపించిన లాస్య ఇప్పటికే ఒక బాబు కు తల్లి అనే విషయం తెలిసిందే.

లాస్య రెండవ సారి తల్లి కాబోతున్న విషయం కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించింది.అప్పటి నుండి కూడా సోషల్ మీడియా లో లాస్య కి పుట్టబోతున్న రెండవ బిడ్డ అమ్మాయా? అబ్బాయా? అంటూ తెగ చర్చ జరిగింది.ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెర పడ్డట్లు అయ్యింది.

లాస్య తనకు పుట్టిన రెండవ బిడ్డ కు సంబంధించిన జెండర్ ని రివిల్ చేయడం జరిగింది.హోలీ సందర్భం గా కాస్త క్రియేటివిటీ ఉపయోగించి లాస్య, ఆమె భర్త, కొడుకుతో కలిసి ఇటీవల పుట్టిన బిడ్డ యొక్క జెండర్ ని రివీల్ చేశారు.

రెండో సారి కూడా బాబు జన్మించాడని లాస్య దంపతులు అధికారికంగా వెల్లడించారు.అమ్మాయి కావాలని చాలా ఆశ తో ఎదురు చూసిన లాస్య కు మరో సారి అబ్బాయి పుట్టాడు.లాస్య సోషల్ మీడియా లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

Advertisement

తన ప్రతి విషయాన్ని కూడా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందు ఉంచుతున్న లాస్య ఈ విషయాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది.ఇద్దరు కొడుకుల తల్లి అయినా లాస్య కోసం కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ బుల్లి తెర పై ఎంట్రీ ఇస్తానంటూ ఆ మధ్య చెప్పిన విషయం తెలిసిందే.

లాస్య బుల్లి తెర పై ఒకానొక సమయంలో ఎన్నో కార్యక్రమాలతో అలరించింది.మళ్లీ ఆ స్థాయిలో లాస్య బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.మరి లాస్య కి ఆ స్థాయిలో మళ్లీ అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు