విజయ్ దేవరకొండ అనసూయ వివాదం పై స్పందించిన ఆనంద్... ఫ్యామిలీకే నా సపోర్ట్ అంటూ?

అనసూయ( Anasuya ) ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా సమయం నుంచి నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో విభేదాలు పెట్టుకున్నారు.

అయితే ఆ విషయాల గురించి విజయ్ దేవరకొండ అప్పుడే మర్చిపోయిన అనసూయ మాత్రం ఆ విషయాన్ని లాగుతూ వస్తున్నారు.ఇక లైగర్ సినిమా సమయంలో అనసూయ విజయ్ దేవరకొండ గురించి చేసినటువంటి ట్వీట్ పెద్ద దుమారం రేపింది.

దీంతో విజయ్ ఫ్యాన్స్ కారణంగా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

Anand Reacting On Vijay Devarakondas Jealousy Controversy, Anand Devarakonda ,

ఇలా విజయ్ ఫ్యాన్స్ చేసినటువంటి ట్రోల్స్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ ఇకపై తాను ఈ వివాదానికి ముగింపు పలుకుతానని తనకు మనశ్శాంతి కావాలని తెలిపారు.ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) నటించినా బేబీ సినిమా( Baby Movie ) నుంచి ట్రైలర్ విడుదలైంది.ఈ సినిమా ట్రైలర్ పై అనసూయ స్పందిస్తూ పాజిటివ్ కామెంట్ చేస్తూ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.

Advertisement
Anand Reacting On Vijay Devarakonda's Jealousy Controversy, Anand Devarakonda ,

ఇక ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు అనసూయ విజయ్ దేవరకొండ మధ్య వివాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Anand Reacting On Vijay Devarakondas Jealousy Controversy, Anand Devarakonda ,

ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ నాకు ఆ వివాదానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు.నెగిటివ్ లేదా పాజిటివ్ అనే దాని గురించి పక్కన పెడితే ఇప్పటివరకు అంత వన్ సైడ్ జరిగింది.వ్యక్తిగతంగా నాకు అనసూయ పై ఎలాంటి కోపం లేదు కానీ నా ఫ్యామిలీ విషయానికి వస్తే నేను ఎప్పుడూ నా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తానని తెలిపారు.

ఇక మీ సినిమా ట్రైలర్ పై పాజిటివ్ గా స్పందించింది అంటూ ప్రశ్నించడంతో ట్రైలర్స్ బాగుంది కాబట్టి పాజిటివ్ గా స్పందించారు.ఇది మంచి విషయమే ఆమె ట్రైలర్ గురించి మాట్లాడారు కానీ నా గురించి మాట్లాడలేదుగా అంటూ ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు