నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన వృద్దుడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet )లోని వెంకటాపూర్ - రగుడు బైపాస్ నుండి సిరిసిల్ల వెళ్తుండగా సుమారు 75 సంవత్సరాల వృద్దుడు సొమ్మసిల్లి పడిపోయాడు.

ఇది గమనించిన ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తాను ప్రయాణిస్తున్న కారు ను అపుమని డ్రైవర్ కు చెప్పి సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధుడిని వెంటనే లేపి అక్కడి నుండి ఒక చెట్టు వద్దకు చేర్చి సేదా తీర్చే ఏర్పాటు చేశారు.

కాగ వృద్ధుడిని పూర్తి వివరాలు అడగగా బోయినపల్లి మండలం( Boinpalli) విలాసాగర్ గ్రామానికి చెందిన మల్లయ్య అని చెబుతున్నాడు.నీకు పిల్లలు లేరా?అని అడగగా తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని గత కొద్ది రోజులుగా విలాసాగర్ వెళ్లలేదని ఎవరూ పట్టించుకోవడం లేదని వృద్దుడు ఆవేదన వ్యక్తం చేశారు.అదే దారి వెంబడి వేరే వాహనాలలో వెళ్తున్న వారు వారి వాహనాలను ఆపి మీరు చూడకుంటే వెనుకాల వచ్చే వాహనాలు వృద్దుడు మీది నుండి పోయేవని మీరు వృద్ధుడిని ఆపి పక్కకు పంపించడం వల్ల నిండు ప్రాణాలు కాపడినట్లు అయిందని ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) ను అభినందించారు.

An Old Man Fell Down On The Road ,Yellareddypet, Rajanna Sirisilla District , O

బాలరాజు యాదవ్ వెంట యూత్ కాంగ్రెస్ మాజీ మండల నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, తదితరులు ఉన్నారు.

జల్సాల కోసం బ్యాంక్‌కి కన్నం ... అడ్డంగా దొరికిపోయిన ఎన్ఆర్ఐ భర్త
Advertisement

Latest Rajanna Sircilla News