రివ్యూ : 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' ఎలా ఉందంటే

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో సినిమా అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మాదిరిగా అయ్యింది.

ఈ ఏడాది ఇప్పటికే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో రచ్చ చేసిన దర్శకుడు వర్మ మళ్లీ ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అలియాస్‌ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను తీసుకు వచ్చాడు.

ఈసినిమా అసలు విడుదల అవ్వడం కష్టం అనుకున్నారు.కాని వర్మ అదృష్టం బాగుండి విడుదల అయ్యింది.

మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈరివ్యూలో చూద్దాం.

కథ :

రాష్ట్రంలో పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తుంది.కొత్త ముఖ్యమంత్రిని ఎలాగైనా దించే ప్రయత్నాల్లో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు.

ఆయనకు తోడుగా మరో పార్టీ నాయకుడు ఉంటాడు.రాజకీయాలు రక్తసిక్తం అవుతాయి.

Advertisement

ప్రతిపక్ష నాయకుడు చేసిన కుట్రలకు సీఎం రాజీనామాకు సిద్దం అవుతాడు.అసలు ఈ రాజకీయ డ్రామా ఏంటీ? ఇందులో ఉన్న పాత్రలు ఏంటీ అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

కీలక పాత్రల్లో నటించిన వారు అంతా కూడా కొత్త వారే.ఎక్కడ నుండి తీసుకు వస్తాడో కాని వర్మకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.

ఎందుకంటే ఆయన అనుకున్న పాత్రలకు వారు అద్బుతంగా సెట్‌ అయ్యారు.ఇక వాయిస్‌ కూడా చాలా బాగా సెట్‌ అయ్యింది.

ఇక తెలిసిన నటుడు అలీ మాత్రమే కొద్ది సమయం కనిపించాడు.బ్రహ్మానందం ఉన్నా కూడా పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్రను చేయలేదు.

టెక్నికల్‌ :

వర్మ సినిమా అంటే ఒకప్పుడు టెక్నికల్‌గా అద్బుతం అనుకునే వారు.ఆయన స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ ఇంకా మ్యూజిక్‌ అన్ని కూడా అద్బుతంగా సెట్‌ అయ్యేవి.శివ సినిమా తర్వాత చాలా సినిమాలు కూడా టెక్నికల్‌గా విప్లవాత్మక మార్పులను వర్మ తీసుకు వచ్చాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
మోహన్ బాబు కు ఫోన్ చేసిన రజినీకాంత్...ఏం చెప్పాడంటే..?

కాని ఇప్పుడు కేవలం వివాదాలకే పెద్ద పీఠ వేస్తూ సినిమాను చేస్తూ టెక్నికల్‌ విషయాలను మర్చి పోయాడు.ఈ సినిమాలోని పాటలు, ఎడిటింగ్‌ సినిమాటోగ్రఫీ ఇలా అన్ని కూడా చెత్తగానే ఉన్నాయి.

Advertisement

దర్శకుడు వర్మ మరోసారి ఈ సినిమాను చెత్తగా తీశాడు.స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉంది.

విశ్లేషణ :

సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా చంద్రబాబు నాయుడు.పవన్‌ కళ్యాణ్‌.

నారా లోకేష్‌ ను టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తుంది.ఆ ముగ్గురి పేర్లు మార్చినా కూడా కాస్త అటు ఇటుగానే ఆ పేర్లనే వాడాడు.

వాళ్లని టార్గెట్‌ చేసే ముఖ్య ఉద్దేశ్యం తప్ప కథ మరియు కథనం పెద్దగా ఏమీ లేదు.అసలు సినిమాను వర్మ ఎందుకు తీశాడో అర్థం కాదు.

వైకాపా మద్దతు దారులకు మాత్రం ఇది పండగ లాంటి సినిమా అనుకోవచ్చు.సినిమా మొత్తంలో ఒకే ఒక్క పాజిటివ్‌ పాయింట్‌ ఏంటీ అంటే సినిమాలో నటించిన నటీనటులు.

వీరు అంతా కూడా ఆయా పాత్రల్లో చక్కగా జీవించారు.

ప్లస్‌ పాయింట్స్‌ :

నటీనటుల ఎంపిక, కేఏ పాల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్‌ ఇంకా చాలా ఉన్నాయి.

బోటమ్‌ లైన్‌ :

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో వర్మ ఏం చూపించాలనుకున్నాడో చూపించాడు.ప్రేక్షకులు మాత్రం చూడలేక పోయారు.

రేటింగ్‌ : 1.5/5.0

తాజా వార్తలు