ఈ సీజన్ లో ఖచ్చితంగా తినాల్సిన ఆకు ఇది.. మిస్ అయ్యారో చాలా నష్టపోతారు

వర్షాకాలంలో ఆకుకూరలను చాలా తక్కువగా తినమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

ఎందుకంటే ఆకుకూరలకు వర్షాకాలంలో( Monsoon ) తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది.

అందుకే ఆకుకూరలను ఎవైడ్ చేయమని చెబుతుంటారు.అయితే ఆకుకూరలు తిన్న తినకపోయినా ఇప్పుడు చెప్పబోయే ఆకును మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్ లో తీసుకోవాలి.

ఇంతకీ అది మరేదో కాదు చింతచిగురు.( Tamarind Leaves ) రుచికి పుల్లగా ఉండే చింత చిగురుతో చాలా రకాల కూరలు తయారు చేస్తుంటారు.

ముఖ్యంగా ఆంధ్ర లో చింతచిగురు కూరలు చాలా మందికి ఫేవరెట్ అని చెప్పాలి.తినే కొద్ది తినాలనిపించే చింతచిగురు రుచి పరంగా అమోఘం.

Advertisement
Amazing Health Benefits Of Tamarind Leaves During Monsoon Details! Tamarind Leav

అలాగే చింత చిగురులో చాలా విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అందువ‌ల్ల ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అదే సమయంలో అనేక వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది.ప్రస్తుత వర్షాకాలంలో రోగ‌ నిరోధక వ్యవస్థను( Immunity Power ) బలంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.

అందుకు చింతచిగురు అద్భుతంగా సహాయపడుతుంది.వారంలో కనీసం రెండు సార్లు అయినా చింత చిగురును తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ గా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దీంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Amazing Health Benefits Of Tamarind Leaves During Monsoon Details Tamarind Leav
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి చింత చిగురు ఓ ఔషధంలా పనిచేస్తుంది.చింత చిగురులో డైటరీ ఫైబర్( Dietary Fiber ) పుష్కలంగా ఉంటుంది.అందువల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మలబద్ధకం అన్న మాటే అనరు.

Advertisement

గొంతు నొప్పి, గొంతు వాపు, గొంతు మంట వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చింతచిగురు మరిగించిన వాటర్ లో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే ఆయా సమస్యలు పరార్ అవుతాయి.

రక్తాన్ని శుద్ధి చేసే గుణం చింతచిగురుకు ఉంది.చింతచిగురును తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలు సైతం తొలగిపోతాయి.అంతేకాదు చింత చిగురును డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ కడుపులో నులిపురుగులు నాశనం అవుతాయి.

కొలెస్ట్రాల్ కరుగుతుంది.మధుమేహం ఉన్న వారిలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.మరియు కంటి చూపు సైతం రెట్టింపు అవుతుంది.

కాబట్టి కచ్చితంగా ఈ సీజన్ లో చింతచిగురును తీసుకోండి.మిస్ అయ్యారో చాలా నష్టపోతారు.

తాజా వార్తలు