కేజీ మామిడి అక్షరాలా రూ.2,400.. లండన్‌లో ఎన్నారైలు గగ్గోలు..??

అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సదుపాయాలకు లోటు ఉండదు కానీ అక్కడ బతకాలనుకుంటే ధనవంతులై పుట్టాలి.

ఎందుకంటే అక్కడ ఆహార పదార్థాలు, ఇంటి అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఢిల్లీకి చెందిన చావీ అగర్వాల్( Chavi Agarwal ) అనే యువతి లండన్‌లో( London ) ఇండియన్ గ్రాసరీస్ స్నాక్స్ ఎంత ఎక్కువగా ఉంటాయో ఓ వీడియో ద్వారా తెలిపింది.ఆమె ఇటీవల లండన్‌లోని ఒక భారతీయ కిరాణా దుకాణానికి వెళ్లి షాపింగ్ చేసింది.

దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.ఈ వీడియోలో, భారతదేశంలో కిరాణా సామాగ్రి ధరలతో పోలిస్తే లండన్‌లో ధరలు ఎంత ఎక్కువగా ఉన్నాయో చూపించింది.ఉదాహరణకు భారతదేశంలో రూ.20కి లభించే లేస్ మ్యాజిక్ మసాలా చిప్స్ ప్యాకెట్ లండన్‌లో రూ.95కి అమ్ముతున్నారు.

భారతదేశంలో చాలా చౌకగా లభించే మాగీ నూడుల్స్ పెద్ద ప్యాకెట్లు లండన్‌లో రూ.300కి అమ్ముతున్నారు.ఒక కిలో ఆల్ఫోన్సో మామిడిపండ్లు( Alphonso Mangoes ) భారతదేశంలో రూ.200-300కి లభిస్తే, లండన్‌లో రూ.2,400కి అమ్ముతున్నారు.ఇండియాలో ఒక కిలో బెండకాయ రూ.50-60 కి లభిస్తే, లండన్‌లో రూ.650కి అమ్ముతున్నారు.ఒక కిలో కాకరకాయ రూ.100-150కి లభిస్తే, లండన్‌లో రూ.1,000కి అమ్ముతున్నారు.

Advertisement

27 ఏళ్ల అగర్వాల్ ఈ ధరలను చూసి చాలా నిరుత్సాహపడ్డారు.ముఖ్యంగా పనీర్( Paneer ) ధర రూ.700 ఉండటం వల్ల పనీర్ చేసుకోలేక, చికెన్ వండుకోవాలని నిర్ణయించుకున్నారు.అగర్వాల్ వీడియో జూన్ 6న పోస్ట్ చేశారు, దీనికి ఇప్పటివరకు 58 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

చాలా మంది నెటిజన్లు వీడియో చూసి ఆశ్చర్యపడ్డారు.కొంతమంది నెటిజన్లు లండన్‌కు వెళ్లే ఆలోచనలను వదులుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు.

మరికొంతమంది లండన్‌లో కాకరకాయలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని వ్యాఖ్యానించారు.ఎన్నారైలు ( NRI ) ఈ ధరలు గగ్గోలు పెట్టకుండా ఉండలేరని మరికొంతమంది అన్నారు.

విదేశాల్లో దొరికే మనకి అలవాటైన భారతీయ వంటల ధరలు చూసి చాలా మంది అవాక్కయ్యారు.ధరలు చూసిన తర్వాత వీటిని కొనుగోలు చేయలేమని ఓ వీక్షకుడు వ్యాఖ్యానించారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

అయితే, కొందరు వీక్షకులు కొనుగోలు శక్తి అనే విషయాన్ని అగర్వాల్ పరిగణనలోకి తీసుకోలేదని కామెంట్ పెట్టారు.లండన్‌లో ఉండే వ్యక్తులు పౌండ్లలో సంపాదిస్తారు ఖర్చు చేస్తారు కాబట్టి, అక్కడి ధరలు వారికి ఎక్కువగా అనిపించకపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు