సూర్యాపేట జిల్లా: తెలంగాణ రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారు.ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో కారుని బైక్ ఢీ కొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై పడి ఉన్నాడు.
సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కన్వాయిని ఆపి తన కన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రున్ని ఎక్కించుకుని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మంత్రి స్పందించిన తీరుపై స్థానిక ప్రజలు,గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.