అల్లు అర్జున్ సరికొత్త రిక్డారు.. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1?

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన నటనకు, అద్భుతమైన డ్యాన్సులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అల్లుఅర్జున్ సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు.

తాజాగా బన్నీ సోషల్ మీడియాలో మరొక అరుదైన రికార్డును సృష్టించారని చెప్పవచ్చు.తాజాగా అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ల ఫాలోవర్స్ మైలురాయిని దాటి సరికొత్త రికార్డును సృష్టించారు.

ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లుఅర్జున్ అని చెప్పవచ్చు.అయితే ఇంస్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన కేవలం నాలుగు సంవత్సరాలకే 13 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకోవడం ఎంతో గొప్ప విశేషమని చెప్పవచ్చు.

Advertisement
Allu Arjun Created New Record Instagram Allu Arjun, Tollywood, Instagram, Sounth

ఇన్స్టాగ్రామ్ ద్వారా అల్లుఅర్జున్ తరచు తనకు సంబంధించిన విషయాలను, సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారని చెప్పవచ్చు.

Allu Arjun Created New Record Instagram Allu Arjun, Tollywood, Instagram, Sounth

అయితే కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్ లో అల్లుఅర్జున్ ఫాలోవర్స్ సంఖ్య 21 మిలియన్ కాగా, ట్విట్టర్లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.తాజాగా ఇంస్టాగ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోవర్స్ కావడంతో బన్నీ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తనని ఇంతగా సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇకపోతే బన్నీ అభిమానులు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో సాధించని అత్యున్నత రికార్డును బన్నీ సొంతం చేసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు ఏకంగా సౌత్ కా సుల్తాన్ అని పిలుస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఈ ఏడాది చివర క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు