అధికారులందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారీ వర్షాలు( Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో సోమవారం (నేడు) ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) ప్రకటనలో తెలిపారు.

జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

భారీ వర్షాలు కురుస్తున్నాయని జాలర్లు చే పల వేటకు వెళ్లవద్దని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోడ్లు, వంతెనలపై నుంచి వాహనదారులు వెళ్లకూడదని సూచించారు.ఆయా శాఖల అధికారులు అందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

బడి బయట విద్యార్థుల గుర్తింపుకు ప్రత్యేక సర్వే

Latest Rajanna Sircilla News