నా సినిమా ఫ్లాప్ అయితే నన్నే నిందించండి... స్టార్ హీరో కామెంట్స్ వైరల్?

ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు ఈ ఏడాది సినిమాల పరంగా పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతూ అభిమానులను తీవ్రంగా గురి చేస్తున్నాయి.

 Akshay Kumar Shocking Comments Cuttputlli Trailer Launch Event Details, Akshay K-TeluguStop.com

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.ఈయన నటించిన వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్‌ పాండే, సమ్రాట్ పృథ్వీరాజ్‌, కొద్ది రోజుల క్రితం విడుదలైన రక్షాబంధన్‌ సినిమా కూడా అభిమానులను ఎంతో నిరాశకు గురిచేసింది.ఇకపోతే తాజాగా అక్షయ్ కుమార్ నటించిన కట్‌పత్లీ సెప్టెంబర్ రెండవ తేదీ విడుదల కావడంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.ప్రేక్షకులకు సినిమాల పరంగా ఏం నచ్చుతుందో,వారే కావాలనుకుంటున్నారు తెలుసుకొని తదుపరి సినిమాలను అలాగే చేస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

Telugu Akshay Kumar, Bachchan Pandey, Bollywood, Rakshabandhan-Movie

ఇక తాను నటించిన గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం పై కూడా ఈయన స్పందిస్తూ తన నటించిన సినిమాలు అపజయం అయితే అభిమానులు పూర్తిగా తనని మాత్రమే నిందించాలని పేర్కొన్నారు.ఇక ఈయన నటించిన కట్‌పత్లీ సినిమా తమిళ రాక్షసన్ సినిమాకు రీమేక్ చిత్రం ఇందులో అక్షయ్ కుమార్ సరసన రకుల్ ప్రీతిసింగ్ నటించిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.మరి ఈ సినిమాతో అయినా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube